ఓం నమో వెంకటేశాయ నామ స్మరణలతో మారు మోగిన మోర్తాడ్
అక్షర విజేత, మోర్తాడ్
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన మోర్తాడ్ గ్రామంలోని అతి పురాతన, ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం పురస్కరించుకొని మంగళవారం అర్ధరాత్రి వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం ఆలయం నుండి మండపం వరకు, మండపం నుండి తిరిగి ఆలయం వరకు రథోత్సవం కోనసాగింది. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు ఓం నమో వెంకటేశాయ అంటూ రథోత్సవాన్ని శోభయాత్రగా నిర్వహించారు. రథోత్సవం శోభయాత్రలో మహిళా భక్తులు అడుగడుగునా మంగళహారకులతో శ్రీ స్వామివారి రథోత్సవంలో వెంకటేశ్వర స్వామి వారికి, సహిత లక్ష్మీదేవి, భూదేవిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జాతరను పురస్కరించుకొని గత వారం రోజులుగా వేద పండితులతో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రతిరోజు పలు పూజా కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించారు. రథోత్సవానికి, చుట్టుపక్కల వివిధ మండలాల, వివిధ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కలు చెల్లించుకొని, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తులు శ్రీ స్వామివారి దైవదర్శనం చేసుకుని, శ్రీస్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. గ్రామఅభివృద్ధి కమిటీ సభ్యులు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం, జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ధర్మపురి వెళ్లిన భక్తులు, తిరుగు ప్రయాణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం అనవాయితీగా కొనసాగుతుంది. గత వారం రోజులుగా శ్రీవెంకటేశ్వర స్వామి వారిస్వామి ఆలయంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాలు, మంగళవారం అర్ధరాత్రి జరిగిన రథోత్సవం, బుధవారం జరిగిన జాతర కు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి, దైవదర్శనం చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కృప పొందారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జాతరను పురస్కరించుకొని, ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు పలు పూజా కార్యక్రమాలకు, రథోత్సవం, జాతరకు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి రోడ్లు పరిశుభ్రత, నీటి సౌకర్యం, ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు…
మోర్తాడ్ గ్రామంలో రథోత్సవం, జాతరను, మంగళవారం అర్ధరాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి విచ్చేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గిర్మాజి గోపి, మోర్తాడ్ గ్రామ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుప్పల అశోక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు బద్దం మైపాల్, యువకాంగ్రెస్ నాయకులు అరుగుల రమేష్, సతీ సమేతంగా విచ్చేసి, వెంకటేశ్వర ఆలయంలో ఆలయ పూజారి ప్రత్యేక పూజలు మండల కాంగ్రెస్ నాయకులు పలువురు నిర్వహించారు. అనంతరం రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.