నూతన బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ప్రారంభించిన
తాండూరు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ పి, రాకేష్ రెడ్డి
అక్షర విజేత తాండూర్
తాండూర్ నియోజకవర్గం యాలాల్ మండలం ముద్దాయిపేట్ గ్రామంలో నూతన బ్రాంచ్ పోస్టాఫీసును తాండూరు సబ్ డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ పి.రాకేష్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా, గ్రామస్తులు అన్ని పోస్టల్ సేవింగ్స్ & ఇన్సూరెన్స్ పథకాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని అభ్యర్థించారు. గత 25 ఏళ్లుగా వినతులు పెండింగ్‌లో ఉన్న తమ గ్రామంలో పోస్టాఫీసు ప్రారంభించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ముద్దాయిపేట గ్రామస్తులు, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు