ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మాజీ జెడ్ పి వై ఎస్ ఛైర్మెన్
మూల రాజిరెడ్డి
వృద్ద ఆశ్రమం కై భూదానం.
అక్షర విజేత ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో…
మానవత్వం చాటుకున్న మూల రాజిరెడ్డి కి ప్రజలు ప్రశంసలు అందుకుంటున్నారు. చెన్నూర్ లో అనాథ పిల్లల కు వృద్దులకు శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవాకార్యక్రమాలు ప్రతినిత్యం అన్నదానం నిర్వహిస్తూ.ఒక ప్రవేట్ కిరాయి భవనంలో గత కొద్ది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. కాగా వృద్దులకు సొంత భవనం లేక ఇబ్బందులూ పడుతున్నారు.గమనించి న మాజీ జెడ్ పి వై ఎస్ ఛైర్మెన్ మూల రాజిరెడ్డి తన సొంత భూమి కొన్ని లక్షల రూపాయల విలువగల స్థలాన్ని వృద్దులకు తనవంతు సహకారం గా భవనానికి దానం చేయడం కాకుండా భూమి పూజ కూడా నిర్వహించి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఇది తెలిసిన ప్రజలు భూములను కబ్జా చేసే నాయకులు ఉన్న ఈ తరుణం లో తన భూమి దానం చేయటం కాకుండా భవన నిర్మాణానికి కృషి చేయటం ఎంతో గొప్ప విషయం అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్బంగా వృద్ధుల బాగోగులు చూసుకుంటూ వారికి నిత్య అన్నదానం నిర్వహిస్తు అనాధలకు ఒక నిడకల్పిస్తున్న మూల రాజిరెడ్డి కి సత్యసాయి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.