
అక్షర విజేత నర్సాపూర్ ప్రతినిధి:
నర్సాపూర్ మండలం ఎల్లారెడ్డి గూడ తండాలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సాపూర్ మండలం ఎల్లారెడ్డిగూడెం తండాలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో వచ్చానని, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో రైతులకు పంట బీమా, రైతులకు పంట నష్టం కింద పదివేల రూపాయలు, రైతు రుణమాఫీ లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశామని, రైతులకు 24 గంటల విద్యుత్ ఇచ్చామని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పది సంవత్సరాలపాటు కేసీఆర్ ప్రభుత్వంలో పంట నష్టపోకుండా రైతులు సుభిక్షంగా ఉండేవారని, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రభుత్వ ఏర్పడిన మూడు నెలలు కంప్లీట్ అయిన రైతులకు విద్యుత్ సరైన పద్ధతిలో ఇవ్వడం లేదని, మండలంలో పంటలు ఎండిపోయిన రైతులను పరిమర్శించి రైతులకు పంట రుణమాఫీ 25 వేల వరకు ఎకరాకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. తాండలల్లో 40 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, సరైన సమయానికి విద్యుత్తు రాక , బోరు మోటార్లు కాలిపోయిన పరిస్థితి నెలకొందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరాకు 25 వేల నష్టపరిచారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తున్నానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ మండల అధ్యక్షుడు భోగ శేఖర్, మాజీ ఎంపీపీ జ్యోతి, సత్యం గౌడ్, పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.