బాదిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
అక్షర విజేత – ఏన్కూర్.
మండలంలో పలు బాదిత కుటుంబాలను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ బుధవారం పరామర్శించారు. కేసు పల్లి గ్రామంలో మృతి చెందిన శెట్టిపల్లి సురేష్ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు. సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోనాయిపాలెం లో మృతి చెందిన వాంకుడోత్ సాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వర్ణ నరేందర్ ఏన్కూర్, జూలూరుపాడు సొసైటీ చైర్మన్లు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు. లేళ్ల వెంకటరెడ్డి, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బోర్రా రాజశేఖర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ శెట్టిపల్లి నాగేశ్వరరావు,లాలూ నాయక్, ప్రభావతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శెట్టిపల్లి సురేష్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శించారు. సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బానోతు సురేష్ నాయక్ పాల్గొన్నారు.