కనీస వేతనం 26,000 వేలు రూపాయలు ఇవ్వాలి: సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే రాజయ్య
అక్షర విజేత సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
రాష్ట్రంలో కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే రాజయ్య అన్నారు. బుధవారం నాడు బొల్లారంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల సవరణ ప్రతిపదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇటీవలి కాలంలో ప్రభుత్వం 72 రకాల షెడ్యూల్ జీవోలను సవరిస్తూ ఇచ్చిన జీవో లపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏం మాత్రం వేతనాలు పెంచకుండా సవరణ చేయడం అనేది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. గతంలో సలహా మండలి ప్రతిపాదించిన దాని కూడా పెట్టకపోవడం అవమానకరమని, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కార్మికులు ఎంతో ఆశలు పెట్టుకున్నారని, కానీ కార్మికుల ఆశలను తుంగలో తొక్క కూడదని ఆయన అన్నారు. గత 15సంవత్సరాలుగాఏ ప్రభుత్వం కూడా కనీస వేతనాలు సవరించలేదని, రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం మరి పెట్టుబడిదారుల కోసమా, కార్మికుల కోసమా వారే తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కార్మికులకోసం అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని, కనీస వేతనాలు కనుక పెంచకపోతే త్వరలో రాష్ట్రంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రప్రభుత్వం పైన ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని, కార్మికులకు అనుకూలంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శ్రీధర్ రావు, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.