మైక్రో డొనేషన్ భారతదేశానికి ప్రాధాన్యతనిచ్చే వారికి సూక్ష్మ విరాళాల ద్వారా బిజెపికి మద్దతు ఇవ్వండి……..
జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్
అక్షర విజేత ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో…
కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భారత దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ పిలుపుమేరకు మైక్రో డొనేట్ హెల్ప్ మేక్ బిజెపి స్ట్రాంగ్ హెల్ప్ మేక్ ఇండియా స్ట్రాంగ్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస అనే నినాదంతోటి భారతదేశానికి ప్రాధాన్యతనిచ్చే వారికి సూక్ష్మ విరాళాల ద్వారా బిజెపికి మద్దతు ఇవ్వండి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది, ఈరోజు కొమురం భీం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మైక్రో డొనేషన్ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు ప్రారంభించారు జిల్లాలోని బిజెపి కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కరూ బిజెపికి మైక్రో డొనేషన్ ద్వారా మద్దతు ఇవ్వాలంటూ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం జిల్లా ఉపాధ్యక్షులు చెనకపురి గణపతి తాలూకా కన్వీనర్ వీరభద్ర చారి జిల్లా కోశాధికారి అరుణ్ లోయ పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్ మండల అధ్యక్షులు రన్వీర్ బిస్వాస్ దెబ్బటి శ్రీనివాస్ గౌతరే వెంకటేష్ కొండ తిరుపతి జాడి మధుకర్ తాటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.