సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన
చేవెళ్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భానూరి ఉపేందర్ రెడ్డి
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని చేవెళ్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉపేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం చేవెళ్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భానూరి ఉపేందర్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.