సకల సౌకర్యాలతో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కేంద్రం
ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూడాలి.
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్.
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి
మార్చి 28న గురువారం జరగబోయే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వనపర్తి ఆర్డీవో కార్యాలయంలో 4వ నెంబర్ పోలింగ్ కేంద్రం సకల సౌకర్యాలతో సిద్దమైంది.బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్ తో కలిసి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. 218 మంది ఓటర్లలో కూడిన 4వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రం చుట్టూ వంద మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలని, అనుమతి లేని వ్యక్తుల్ని పోలింగ్ కేంద్రం పరిసరాల్లో అనుమతించవద్దని అధికారులను ఆదేశించారు.అదనపు కలెక్టర్ రెవెన్యూ . నగేష్, ఆర్డీవో పద్మావతి, ఎన్నికల సిబ్బంది, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.