
ప్రజా చైతన్యం కోసం కనువిప్పు కార్యక్రమం
అక్షర విజేత సిద్దిపేట్
సమస్యలు అనేటివి మనుషులకే వస్తాయి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి కానీ ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాన్ని రోడ్డున పడవేయవొద్దని.
ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది దాన్ని సార్ధకత చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.
ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది దాన్ని శోధించుకుంటూ ముందుకు వెళ్లి జీవన ప్రయాణం సాగించాలని సూచించారు.
భారత ఎన్నికల సంఘం నూతనంగా ప్రవేశ పెట్టిన సీ-విజిల్ సి వి ఐ జి ఐ ఎల్ యాప్
ఎన్నికల పోటీచేసే అభ్యర్థులు కానీ, అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కానీ ఓటు వెయ్యమని ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన, డబ్బులు ఆశ చూపి ప్రలోభ పెట్టినా, మద్యం డబ్బులు ఓటర్లకు సరఫరా చేసిన, ఎలాంటి నేరపూరిత చర్యలకు దిగిన, ఎన్నికల సంఘం నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన మరియు అల్లర్లు, గొడవలకు పాల్పడిన వెంటనే గ్రామాల ప్రజలు యువకులు స్పందించి ఈ యాప్ మొబైల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫిర్యాదుదారులు సంబంధిత వీడియోలు, ఫోటోలు, తీసి యాప్ లో అప్లోడ్ చేసినచో ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. కావున గ్రామాలలోని ప్రజలు యువకులు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, ఈ యాప్ ఎన్నికలకు సంబంధించిన యాప్ అని ఈ యాప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.గ్రామాలలో పట్టణాలలో ఎన్నికల సందర్భంగా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించిన డబ్బులు పంచినా, ఓటర్లను మభ్యపెట్టిన, బెదిరింపులకు గురిచేసిన ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించిన ఎలాంటి చర్యలకు పాల్పడ్డా వెంటనే ఎలక్షన్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 1950, ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.తల్లిదండ్రులు యువకులైన పిల్లలపై ఒక కన్నేసి ఉంచాలని ఎక్కడికి వెళుతున్నారు ఏం చేస్తున్నారో ప్రతిరోజు గమనిస్తూ ఉండాలని తెలిపారు.గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఎవరైనా కలిగి ఉన్నా లేదా విక్రయించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకుండా చూసుకోవలసిన బాధ్యత గ్రామ పెద్దల పై ఉంటుందన్నారు.మూఢనమ్మకాలు నమ్మవద్దు మంత్రాలు చేతబడులంటూ నయం చేస్తామని చెప్పుకునే వారి మాటలు నమ్మవద్దు ఈ టెక్నాలజీ ప్రపంచంలో భానుమతి వాళ్లు చేశారు వీళ్ళు చేశారు అంటే నమ్మవద్దు ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రిలో చూపించుకోవాలి.సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి,
సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గ్రామాలలో పట్టణాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినా బ్యాంకు వివరాలు ఏటీఎం కార్డు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పవద్దు, వాట్సప్ కు మరియు ఫోన్ కు ఎలాంటి మెసేజ్ వచ్చిన ఓపెన్ చేయవద్దు స్పందించవద్దు,
ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
పోలీస్ కళా బృందం కనువిప్పు అనే కార్యక్రమం ద్వారా మూఢనమ్మకాల పై మరియు మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలు, కుటుంబ కలహాలు గురించి, పేకాట ఆడుట వలన కుటుంబలో జరుగుతున్న పరిణామాలను, వరకట్నం వలన జరుగుతున్న సంఘటనలు గురించి, ఈ మధ్య జరుగుతున్న ఆత్మహత్యలు గురించి, మరియు వృద్ధులైన తల్లిదండ్రులను మంచి చూసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ , షీ టీమ్స్ జరుగుతున్న సైబర్ నేరాల గురించి పాటల ద్వారా, సిడిల ద్వారా రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, హెల్మెట్ వినియోగం, మూఢనమ్మకాలు, మంత్రాలు తంత్రాలు, సామాజిక రుక్మతల గురించి ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది కళాబృందం సభ్యులు బాలు, రాజు, రవీందర్, తిరుమల, జిల్లా సాంస్కృతిక సారధి బృందం సభ్యులు రాజేష్, భాస్కర్, యాదగిరి, నర్సింలు, బాబు, వెంకటేష్, శేఖర్, మంజుల, రాజమణి పాటల రూపంలో మరియు నాటకం రూపంలో ప్రజలను చైతన్య పరిచినారు
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పెద్దలు, యువకులు, బాల బాలికలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.