* ప్రసాద్ కుమార్ గెలుపు కోసం కృషి చేసిన వారికి న్యాయం చేయాలి
* ప్రసాద్ కుమార్ ఓటమిని కోరుకున్న రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తల సహకారం ఉండదు
* నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగాలి
* ధరూర్ మండల మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ షేక్ ఫిరోజ్
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
.
అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రసాద్ కుమార్ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరగాలని ధరూర్ మండల మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ షేక్ ఫిరోజ్ పేర్కొన్నారు. గురువారం ధరూర్ మండల మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ షేక్ ఫిరోజ్ అక్షర విజేత వికారాబాద్ ప్రతినిధితో మాట్లాడుతూ, గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి, వికారాబాద్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ కుమార్ ఓటమి చెందాలనే దురుద్దేశంతో ఉన్న చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి గెలుపుకు వికారాబాద్ నియోజకవర్గ నిజమైన ప్రసాద్ కుమార్ అభిమానుల సహకారం ఉండదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రసాద్ కుమార్ గెలుపు కోసం కృషి చేసిన జెడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కి ప్రసాద్ కుమార్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు సహకరిస్తారని అన్నారు. చేవెళ్ల ఎంపీ టికెట్ గడ్డం రంజిత్ రెడ్డికి కాకుండా, జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డికే ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి గుర్తింపు లేకుండా బిఆర్ఎస్ పార్టీ నుండి కొత్తగా వచ్చిన రంజిత్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇవ్వడం సరికాదని ఫిరోజ్ పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమైన రంజిత్ రెడ్డికి చేవెళ్ల టికెట్ తప్పించి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కేటాయించాలని ఆయన అన్నారు.