ఉత్తమ అవార్డు అందుకున్న జయప్రకాష్
అక్షర విజేత అలంపూర్
టీవీ నిర్మూలన కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రస్తుతం రాజోలి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో పనిచేస్తున్న టిబి నోడల్ పర్సన్ జయప్రకాశ్ కు ఉత్తమ అవార్డ్ వరించింది. గద్వాల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శశికళ, డిప్యూటి డి ఎమ్ హెచ్ ఓ టిబి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సిద్దప్ప మంగళవారం గద్వాల్ జిల్లా కేంద్రంలోనీ వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం లో జయప్రకాశ్ కు ప్రశంసాపత్రం ను అందజేశారు.జయప్రకాశ్ కు ఉత్తమ అవార్డ్ రావడం పట్ల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు, రామకృష్ణ, హెలెన్, రంజిత్ కుమార్, ఏ ఎన్ ఎమ్ లు, ఆశా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.