బిఆర్ఎస్ తెచ్చిన నిధులను కాంగ్రెస్ చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటు
బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు
అక్షర విజేత ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో…
గతంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చేసిన అభివృద్ధి పనులను ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు తాము 202 కోట్ల నిధులు తెచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు పని బిఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ….. 100 రోజుల్లో మీరేం చేశారు ప్రజలు గమనించారని. మీరు తీసుకువచ్చిన నిధులకు ఆధారాలు జీవోలు ఏమైనా ఉంటే చూపించాలని 202 కోట్లు ఎక్కడినుండి తెచ్చారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు . డి ఎం ఎఫ్ టి 460 కోట్ల ఫండ్స్, 360 కరెంటు స్తంభాలు రద్దు చేసిన ఘనత తమకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రంగపేట బ్రిడ్జిని మసిపూసి మారేడు కాయ అనే విధంగా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు 12 కోట్ల జీవో 703 ప్రకారం తీసుకువస్తే దానిని రద్దుచేసి మరల కొత్త జీవో తో పాటు 13.5 కోట్ల రూపాయలకు మార్చారని దానిలో కాంగ్రెస్ నాయకులు చేసింది ఏమీ లేదని అన్నారు. ఎం సి హెచ్ హాస్పిటల్ కి దివాకర్ రావుకు ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుతం ఐబి లో ఎం సి హెచ్ హాస్పిటల్ ఏర్పాటుకు తాము విరుద్ధం కాదని, ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయుట ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అంతర్గాం బ్రిడ్జ్ నిరుపయోగం కాదని ప్రజలకు అందరికీ ఉపయోగా పడేలా ప్రణాళిక రూపొందించారని, అభి చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య ఉండదని ప్రస్తుతం ఎన్‌హెచ్ రింగ్ రోడ్లు ఏర్పడడం వల్ల భారీ వాహనాలు మళ్ళించబడ్డాయని తెలిపారు. ప్రజాస్వామ్య క్షేత్రంలో గెలుపోటములు సహజమని ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు గతంలో రెండు పర్యాయాలు ఓడిపోయారని. ప్రజలు నిబద్ధత ఉంటారని అన్నారు. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు రావడానికి గత ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని జాలి గుట్ట వద్ద రిజర్వాయర్ ఏర్పాటుచేసి రంగపేట సంపు ద్వారా ఇప్పుడు నీళ్లు అందుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమృత్యం పథకం ప్రవేశపెట్టిందని దానిద్వారా మంచిర్యాలకి 140 కోట్ల, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసం ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం ఏమిటో తెలియజేయాలని కోరారు.ప్రజల ఆకాంక్షను గౌరవించాలని అంతర్గాం బ్రిడ్జి, గ్రీన్ ఫీల్డ్ హైవే, వీటిపై పున పరిశీలించి ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలని అన్నారు. 202 కోట్లు ఎక్కడి నిధులు? జీవో ని చూపించాలని ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పోరాడుతామని తెలిపారు. కరకట్ట విషయంలో ఎందుకు స్పందించడం లేదని, డిఎంఎఫ్టి నిధులను స్వల్పంగా మార్చి తెచ్చినం అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగారు. రైతులు అరిగోశ పడుతున్నారని కెసిఆర్ హయాంలో సాగునీరు తాగారు అందించారని, కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మీరు రైతులను కలవండని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ అధ్యక్షులు అంకం నరేష్, గాదెసత్యం, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.