అక్షర విజేత, నిజామాబాద్ సిటీ
నగరంలోని వినాయక్ నగర్ విగ్రహాల పార్క్ నందు జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ లో వారి కుల దైవం కేతేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టపన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొని కేతేశ్వర స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ధన్ పాల్ మాట్లాడుతూ చేతివృత్తుల వారికీ బిజెపి పార్టీ, తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రకాల చేతి కుల వృత్తుల వారి అభివృద్ధి, సంక్షేమం పాతుపడుతుందన్నారు. అందులో భాగంగానే విశ్వకర్మ యోజన పథం తీసుకోరవడం జరిగిందని, ఈ పథకం ద్వారా చేతివృత్తుల వారికీ అదునతన శిక్షణ ఇవ్వడం, శిక్షణ సమయంలో రోజుకి 500, పని ముట్లకు 15,000 శిక్షణ అనంతరం లక్ష నుండి మూడు లక్షల వరకు ఋణం అందించి చేతివృతులకు అండగా నిలవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పరమపూజ్య శ్రీశ్రీ ఇమ్మడి బసవ మేదర కేతేశ్వర మహాస్వామి (చిత్రదుర్గ కర్ణాటక), నిజామాబాద్ జిల్లా మేదరి సంఘం అధ్యక్షులు, దేవేందర్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.