ఆకట్టుకున్న ఆల్ఫోర్స్ ప్రథమ ఉస్థవ్..
అక్షర విజేత ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో…
ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించేందుకు విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యమని ఆల్ఫోర్స్ విద్య సంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మంచిర్యాల లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఆల్ఫోర్స్ ప్రథమ ఉస్థవ్
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గా హాజరై మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో లో విద్యార్థులకు విద్య తో పాటు సామాజిక అవగాహన ఉండాలని ,ప్రతి ఒక్క విషయం పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.ముందు ఉన్న అవకాశాలను వినియోగించుకొని పోటీ దారులు గా నిలిచి ఘన విజయాలు సాధించాలని,ఇంటర్ నెట్, సెల్ ఫోన్స్ కు బానిస లు కవొద్ధని ,సమయం చాలా విలువ అయినదని దానిని వినియోగించుకొని ఉత్తమంగా నిలవాలని కోరారు.ఉస్తవం లో పిల్లలు చేసిన డ్యాన్స్ ,సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాటశాల సిబ్బంది పిల్లల తల్లి తండ్రులు పాల్గొన్నారు.