నిరుపేదలకు చేయూత ..జేడీ ఫౌండేషన్ ఉపాధి భరోసా
అక్షర విజేత భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి
నిరుపేదలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్లు నిలబడగలగే స్థాయిని కల్పించడమే లక్ష్యంగా గత మూడు సంవత్సరాలుగా జేడీ ఫౌండేషన్ భరోసా ఉపాధి భరోసా పేరుతో చేస్తున్న కార్యక్రమాలు ఎంతో గర్వించదగ్గవని తెలిపారు భద్రాద్రి చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ఖంభంపాటి సురేష్ కుమార్. ఈ మేరకు పాత మార్కెట్ నందు రోజువారి కూలీలు పనిచేసే చిన్నం శైలజ మరియు మహేష్ అనే దంపతులకు చాలీచాలని జీవితాలు గడుపుతుండగా వారిచే సొంతంగా వ్యాపారం చేయించాలనే సహృదయంతో జేడీ ఫౌండేషన్ ఆర్థిక సాయం తో చిరు వ్యాపారం( హోటల్ని) ప్రారంభింపజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కంభంపాటి సురేష్ కుమార్ ఈ నూతన వ్యాపారాన్ని ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా ఉపాధి భరోసా పేరుతో జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారాలు ప్రారంభించింది భద్రాచలంలో నేనని, ఇప్పుడు ఈ కార్యక్రమం అనేక స్వచ్ఛంద సంస్థలు అనేక ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చేస్తూన్నాయని ఇటువంటి జెడి ఫౌండేషన్ లో తాను కూడా భాగస్వామి గా ఉన్నందుకు గర్విస్తానని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జేడీ ఫౌండేషన్ కన్వీనర్ మురళి మోహన్ కుమార్ మాట్లాడుతూ ఉచిత పధకాలకు బై బై.. కష్టపడి పని చేసే వారికి జై జై అనే నినాదంతో భద్రాచలంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని , ఈ కార్యక్రమానికి ఈ ప్రాజెక్టుకి సహకరించిన జేడీ లక్ష్మీనారాయణ కి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ హన్సి పవన్ కుమార్, వినీల దేవి, కడాలి నాగరాజు, కొంజెర్ల నగేష్ తదితరులు పాల్గొన్నారు.