బ్యూటీ పార్లర్ షాప్ ఘనంగా ప్రారంభోత్సవం
అక్షర విజేత మరిపెడ:-
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎంపీడీవో కాంప్లెక్స్ లో మండలంలోని వీరారం గ్రామానికి చెందిన మామిడాల మునేష్ అనే యువకుడు ‘సాగర్ మెన్స్ బ్యూటీ పార్లర్ అండ్ హెయిర్ స్టైల్’ షాపును మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడి నవీన్ రావు మరిపెడ ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు కలిసి ప్రారంభించారు.ఉపాధి మార్గాలపై దృష్టి సారించాలన్నారు. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసంఎదురు చూడకుండా స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని కుటుంబానికి ఆసరాగా నిలవాలన్నారు. చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని పలువురికి ఉపాధి కల్పించడంతోపాటు సమాజంలో ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో కేలోత్ హరినాయక్, బీఆర్ఎస్ నాయక్ లు అజ్మీరా హరి నాయక్, జర్పుల కాలు నాయక్, బొల్లం నర్సయ్య,దిగజర్ల శ్రీను, ముఖేష్, గంధసిరి కృష్ణ, గుండగాని సుందర్, చంద్రయ్య, మహిపాల్ ,మామిడాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.