
చర్చిలో ప్రార్థన చేసిన క్రైస్తవులు
మానవాళి పాపాలను కడగడం కోసం,ఏసుక్రీస్తు చేసిన త్యాగం
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ కేంద్రంలోని డైట్ కాలేజీ వెనుకలో ఉన్న బేతేలు ప్రార్థన మందిరంలో క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ను ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని పలు చర్చిల్లో క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. మానవాళిని రక్షించేందుకు దైవ కుమారుడిగా అవతరించిన ఏసుక్రీస్తును స్తుతిస్తూ ప్రార్థనలు చేశారు. ఏసు కీర్తనలతో ప్రార్థనలతో చర్చిలు మారుమోగిపోయాయి. క్రైస్తవులు తమ కోసం ప్రాణాలు అర్పించిన యేసును భక్తిశ్రద్ధలతో తలుచుకున్నారు. ఏసు త్యాగని తలుచుకుంటూ క్రైస్తవులంతా భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. లోక రక్షణ కొరకు మరణించిన యేసు కోసం ఉపవాసాలు ఉన్నారు. క్రైస్తవ మతంలో ఈస్టర్ కు ముందు శుక్రవారం నాడు పాటించే ఒక స్మారక రోజును గుడ్ ఫ్రైడే గా భావిస్తారు. ఇదిఏసుక్రీస్తును శిలువ వేసిన రోజు. కల్వరిలో ఆయన మరణాన్ని గుర్తుచేసుకునే క్రైస్తవ సెలవు దినం. ఈరోజుకు జ్ఞాపకార్ధంగా యేసును స్మరించుకుంటూ గుడ్ ఫ్రైడే గా ప్రార్థనలు చేశారు. క్రైస్తవ మత చరిత్ర గ్రంథాల ప్రకారం గుడ్ ఫ్రైడే అనేది ఒక సంతాపదినం.ఈ విచారకరమైన రోజును గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తారో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. గుడ్ అంటే మంచి, ఆ మంచికి ప్రతిరూపమే దేవుడు. త్యాగం చేయడం మంచి గుణం, ఏసు పవిత్ర త్యాగంతో ప్రపంచంలోని మానవాళికి మంచి జరిగింది. అందుకే ఏసు మంచితనాన్ని త్యాగనిరతిని చాటి చెప్పేందుకే ఈరోజు నుండి గుడ్ ఫ్రైడే గా పిలవడం ప్రారంభమైంది. హోలీ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఈస్టర్ మాదిరిగానే గుడ్ ఫ్రైడే రోజున ఏలాంటి సంబరాలు జరుపుకోరు. గుడ్ ఫ్రైడే సంతోషకరమైన సందర్భం కాదు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతం ఆచరించే వారు ఈరోజు మౌనన్ని పాటిస్తారు. కొందరు ఉపవాసం ఉంటారు సంతాపం వ్యక్తం చేస్తారు.ఏసుక్రీస్తు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడానికి ఇది ఒక పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. తను నమ్మిన వారి పాపాలను విమోచించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన రోజుగా భావిస్తారు. ప్రపంచ మానవాళి పాపాలను కడిగేందుకు తన కుమారుని జీవితాన్ని త్యాగం చేశాడు. ఏసుక్రీస్తును విశ్వసించిన ప్రజల పాపల కోసం, అతను తన జీవితాన్ని అర్పించాడు. అందుకే ఈ రోజున సంతాపం దినంగా చూస్తారు. ప్రజల పాపాల నీడల నుండి మానవాళిని రక్షించడానికి యేసు త్యాగం చేశాడు. యేసు త్యాగాలకు గుర్తుగా గుడ్ ఫ్రైడే నాడు ప్రజల తమ శోకాన్ని తెలియజేస్తారు, ఆహారం తీసుకోరు వేడుకలు జరుపుకోరు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది ఒక విచారకరమైన రోజుగా క్రైస్తవులు భావిస్తారు.