గద్వాల: నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేయాలి
అక్షర విజేత గద్వాల బ్యూరో:
రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి జిల్లా సరిహద్దుల్లో అక్రమ మధ్యం, పి డి ఎస్ రైస్, నగదు, రవాణ జరగకుండా ప్రత్యేక నిఘా తో గస్తీ నిర్వహించాలి.నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్, ఐ పి ఎస్,నమోదు అయిన ప్రతి కేసుల్లో పకడ్బందీ గా విచారణ చేపట్టాలని, అందుకు అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించి సాంకేతికతను ఉపయోగించి చార్జి షీట్ ఫైల్ చేసి నిందితులను శిక్షలు పడేందుకు కృషి చేయాలి పోలీస్ అధికారులను ఆదేశించారు.ప్రతి గ్రమంలో బెల్ట్ షాప్స్ లేకుండా చూడాలి గ్రేవ్ కేసులలో బెయిల్ పై వచ్చిన నిందితులు ప్రస్తుత ఎక్కడెక్కడ ఉన్నారు ఏమీ చేస్తున్నారు. అనే విషయాలను గమనిస్తూ ఉండాలని, వారి పై షీట్స్ ఓపెన్ చేయలని ఆదేశించారు. ప్రతి కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు,సిబ్బంది. ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలిజాతీయ రహదారి నుండి గ్రామాలకు వెళ్లే అప్రోచ్ రోడ్ల దగ్గర గ్రామస్థులతో మాట్లాడే లైటింగ్స్ ఏర్పాటు చేయించి, అలాగే హైవే అథారిటీ వారితో మాట్లాడి అప్రోచ్ రోడ్డు డివైడర్ పై లైటింగ్ ఏర్పాటు చేయించి గ్రామాలలో, పట్టణలలో ప్రజలతో కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించి సి సి కెమెరాల ఏర్పాటు చేసుకునే టట్లు ప్రోత్సహించాలని ఆదేశించరు.ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె.గుణ శేఖర్,డి.ఎస్పీ కె.సత్యనారాయణ, ఎస్బి ఇన్స్పెక్టర్ జములప్ప , గద్వాల్, ఆలంపూర్, శాంతి నగర్, సి.ఐ లు భీష్మ కుమార్, రవి బాబు, కె. ఎస్. రత్నం,జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు , డిసి ఆర్బి, ఐటీ, విభాగాల ఎస్సై లు పాల్గొన్నారు.