దుబ్బాక గ్రామంలో పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాలు
-పశువులకు ఉచిత టీకాలు ఇస్తున్న పశువైద్యాధికారులు.
అక్షర,విజేత నిజామాబాద్ ప్రతినిధి:
ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మూడు నెలల పై బడిన వయసు గల ఆవులు, గేదెలు, దూడలకు గురువారం నాడు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరిగిందని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డా.జగన్నాధ చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దుబ్బాక గ్రామంలో సుమారు ఆరు వందల నుండి ఏడు వందల పశువులకు టీకాలు ఇవ్వడం జరిగిందని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డా. జగన్నాధ చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డా. బాలీగ్ అహ్మద్,పశువైద్యాధికారి గంగా ప్రసాద్,సిబ్బంది శివ,సుభాష్,గోపాల మిత్రులు మహిపాల్,గ్రామ రైతులు పాల్గొన్నారు.