వేసవికాలంలో పండే పంటలపై దృష్టి సారించండి
అక్షరవిజేత మహబూబాబాద్
వేసవిలో ఆయిల్ పామ్,మామిడి,జామ,డ్రాగన్ ఫ్రూట్ కూరగాయల సాగులో రైతులు చేపట్టవలసిన జాగ్రత్త చర్యలు,మేలైన యాజమాన్య పద్దతులపై
గురువారం జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న కురవి,సీరోలు,డోర్నకల్ మహబూబాబాద్ తదితర మండలాలలోని పలు గ్రామాలలో ఆయిల్ పామ్,మామిడి,జామ,డ్రాగన్ ఫ్రూట్ కూరగాయల తోటలను పరిశీలించారు.వేసవిలో ఉద్యాన పంటలు చేపట్టి రైతులు లాభం పొందాలని కోరినారు.మహబూబాబాద్ జిల్లాలో96,631ఎకరాలలో రైతులు పలు ఉద్యాన పంటలను సాగు చేయుచున్నారు.ప్రస్తుత మార్చి,ఏప్రిల్ నెలలలో పలు ఉద్యాన పంటల సాగువలన లాభం కలుగుతుంది.ప్రస్తుతం రైతులు తీసుకోవలసిన సాంకేతిక సూచనలు సలహాలను రైతులకు తెలియజేసినారు.రైతులు ఆయిల్ పామ్ తోటలలో అంతర పంటలుగా కూరగాయలైన టమాట,మిర్చి,బీర,వంగ,గోరు చిక్కుడు,బెండ,ఉల్లి,బీట్ రూట్,ఆకుకూరలు,కొత్తిమీర,పుదీనా తదితర పంటలతో సాగు లాభదాయకంగా ఉంటుందని వాటితో పాటు ఆధునిక పద్దతులు అయిన ఎత్తైన మడులు,బిందు సేద్యం,మల్చింగ్ విధానం,సేంద్రియ పద్దతులను కూడా వివరించారు.దీనివలన దిగుబడులు30నుంచి40శాతం పెరుగును అని తెలియజేసినారు.మహబూబాబాద్ జిల్లాలో రైతులు డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్,ఉద్యాన పంటలు,కూరగాయల సాగు,పూల సాగు తదితర వాటిని సాగుచేసి రైతులు నికర ఆదాయం పొందాలని తెలియజేసినారు.రైతులకు వర్మి కంపోస్ట్,వేప పిండి,కానుగ పిండి,వేప నూనే వాడకంతో పాటు పూర్తి సేంద్రియ పద్దతుల్లో వంగ,టమాట,మిర్చి,బీర,బెండ,సొర తదితర పంటల సాగు విధానాన్ని కూడా తెలియజేసినారు.రైతులు సమీకృత వ్యవసాయాన్ని ఆధునిక పద్దతుల్లో చేపట్టాలని తెలిపినారు.రైతులందరు రైతు ఉత్పత్తి సమాఖ్యలుగా ఏర్పడి,పంట కాలనీలను ఏర్పరుచుకొని,కూరగాయల సాగు చేసి మన జిల్లాలో స్వయం సమృద్ధి సాదించాలని విజ్ఞప్తి చేశారు.