తండ్రి శవం ఇంటిముందు-దుఃఖంతో కూతురు పరీక్షకు హాజరు
— పరీక్ష అనంతరం తండ్రి అంతక్రియల్లో పాల్గొన్న పావని
— మండలంలోని జూపల్లిలో విషాదం
అక్షరవిజేత,చారకొండ:
చారకొండ మండలంలోని జూపల్లి గ్రామానికి చెందిన కడారి తిరుపతయ్య అయిదు రోజుల క్రితం బ్రెయిన్ స్టోక్ రావడంతో అతన్ని కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.చికిత్సపొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు.తండ్రిని కోల్పోయిన పావని పుట్టెడు దుఃఖంతో బాధను దిగమింగి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రానికి హజరైంది.బంధువులు,ఉపాధ్యాయులు,తోటి విద్యార్థులు పావనికి మనోధైర్యం నింపి మంగళవారం జరిగిన ఫిజికల్ సైన్స్ పరీక్ష రాసేందుకు ఒప్పించారు.దీంతో పావని పరీక్ష రాసి మధ్యాహ్నం ఇంటికి వచ్చి తండ్రి అంతక్రియల్లో పాల్గొన్నది.పలువురు నాయకులు హత్యక్రియలో పాల్గొన్నారు.