నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
సకల కళల సమాహారం నాటకం
సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
నాటకం సకల కళల సమాహారమని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు.బుధవారం ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ రంగస్థల కళాకారుడు,జిల్లా అదనపు ఎస్పీ తేజావత్ రాందాస్ ను కళా వేదిక ప్రతినిధులు ఆయన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ అతి ప్రాచీనమైన నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.అనాదిగా నాటకం ప్రజల కాలక్షేపానికే గాక సమాజ మార్పుకోసం వేదికగా నిలిచిందని చెప్పారు.ఎంత ఉన్నత ఉద్యోగంలో ఉన్నప్పటికీ నిత్యం నాటక రంగాన్ని అభిమానిస్తూ ఆరాధిన్న గొప్ప కళాకారుడు తేజావత్ రాందాస్ అని శంకర్ గౌడ్ ఆయనను కొనియాడారు.ఈనాటి కార్యక్రమంలో డా.మురళీధర్, జనజ్వాల,చిన్నమ్మ థామస్ , యస్. చంద్ర శేఖర్,మల్యాల బాలస్వామి,సత్తార్,గంధం నాగరాజు, బైరోజు చంద్ర శేఖర్,డా.శ్యాం సుందర్, నందిమళ్ల రాములు, రాంరెడ్డి, బుచ్చిబాబు,బండారు శ్రీనివాస్,నవీన్ రెడ్డి, శ్రీలక్ష్మి,అరుణ,రాజు తదితరులు పాల్గొన్నారు.