ప్రతి గ్రామంలో ఉపాధిపనులు ప్రారంభించి కనీససౌకర్యాలు కల్పించాలి: సిపిఎం
అక్షర విజేత జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి
జిల్లాలోని 13 మండలాలలోని 255 గ్రామపంచాయతీలలో గ్రామీణ ఉపాధి హామీ పనులను వెంటనే ప్రారంభించి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి డిమాండ్ చేశారు మంగళవారం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వెంకట స్వామి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులను ప్రారంభించలేదని వెంటనే ప్రతి గ్రామపంచాయి తీలో పనులను ప్రారంభించి పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కొన్ని గ్రామాలలో గత రెండు సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ బిల్లులు రాలేదని అన్నారు పని ప్రదేశాలలో కూలీలకు టెంటు, మంచినీటి సౌకర్యము, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, ప్రధమ చికిత్స పెట్టే వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల కూలీలు వడదెబ్బకు గురి అయ్యి తీవ్ర అనారోగ్యల పాలౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కూలీలు తమ సంపాదించిన మొత్తాన్ని ఆసుపత్రులకే ఖర్చు చేస్తున్నారని అన్నారు, గ్రామీణ ఉపాధి హామీలో పని చేసే ప్రతికూలికి కొలతలతో సంబంధం లేకుండా కనీస కూలి 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు, ప్రస్తుతం పెరుగుతున్న నిత్యవసరల ధరలను బేరిజు వేసుకొని చూసుకుంటే కనీస వేతనం 600 రూపాయలు ఉంటేనే వారి అవసరాలు తీరుతాయని అన్నారు. అదే సందర్భంలో పని ప్రదేశాలలో ప్రభుత్వమే పరికరాలు అందించాల్సి ఉండగా పరికరాలను సైతం కూలీలే సొంతంగా తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, కనీసం తెచ్చుకున్న పరికరాలకు ప్రభుత్వం అదనంగా డబ్బులు అందజేయాల్సి ఉన్న ఇవ్వటం లేదని అన్నారు ఉపాధి హామీ పనుల సందర్భంగా అదనంగా బత్యాన్ని ఇవ్వాల్సి ఉండగ ఇవ్వవలసిన బత్యాన్ని సైతం పెండింగ్లో పెడుతున్నారని అన్నారు ఉపాధి హామీకి అరకొర నిధులు కేటాయించి కూలీలతో మాత్రం నిరంతరం పనులు చేయిస్తూ వారికి కూలీలు ఇవ్వకుండా వేధించడం సరైనది కాదన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక కూలీలు ఉపాధికి వెళ్తున్నారని పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా వారికి పరికరాలు అందించకుండా ఏ విధంగా ఉపాధి హామీ పథకం విజయవంతం అవుతుంది అని ప్రశ్నించారు పనులు కల్పించాల్సిన అధికార యంత్రాంగము క్షేత్రస్థాయిలో కూలీలు పనులు అడిగిన కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉపాధి హామీలో పని చేసే ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు, పట్టణ ప్రాంతాల్లో కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి పథకంలో పని దినాల సంఖ్యను వంద నుంచి 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వివి నరసింహ, ఉప్పేరు నరసింహ,సవారన్న తదితరులు పాల్గొన్నారు.