తెలంగాణలో ఎమ్మెల్సీ కవితకు ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. కవిత ఇంట్లో ఈడీ అధికారులు భారీగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. MLC కవిత పిటిషన్‌పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని పిటిషన్ వేశారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం విచారణ జరపడం లేదని కవిత ఆరోపించారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్ లో కోరారు.
అయితే గతం లో ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత కు ఫిబ్రవరిలో సీబీఐ నోటీసులు జారీ చేసింది సీబీఐ. గత నెల 26 న విచారణకు రావాలని సీబీఐ ఈ మెయిల్ పంపింది. గతంలో ఒకసారి ఆమె నివాసంలోనే కవితను విచారించిన సీబీఐ.. 2022 డిసెంబర్ 11 న కవిత నివాసం లో స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. 14 నెలల తరువాత కవిత కు రెండో సారి ఫిబ్రవరి లో సీబీఐ నోటీస్ అందింది. అయితే ఈడీ నోటీసు ఇచ్చిన నెల రోజులకే సీబీఐ మరో నోటీసు జారీ చేసింది. తాజాగా ఎమ్మెల్సీ కవిత ఇంట్లో పది మంది ఐటి అధికారులతో ఢిల్లీ నుండి వచ్చిన ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.