
_ సామాజిక సేవ లో ముందుంటా
_ ప్రతి ఒక్కరు అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి.
_ దళితరత్న అవార్డు గ్రహీత కైతల పురం రాములు
అక్షర విజేత పటాన్చెరువు
సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా కైతాపురం రాములు కి దళిత రత్న అవార్డు లభించింది. స్వామి వివేకానంద అవార్డు 2024 గోల్డెన్ స్టార్ యూత్ కల్చర్ ఆధ్వర్యంలో దళితరత్నగా కైతల పురం రాములను ఎంపిక చేసి అవార్డు అందించడం జరిగింది.ఈ సందర్భంగా తన నివాసంలో సోమవారం రోజు పుట్టాల శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా కైతల పురం రాములు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం తనకెంతో సంతోషంగా ఉందని రానున్న రోజుల్లో బహుజన వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం జరుగుతుందని, బహుజనులను చైతన్య పరచడంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ,బహుజనుల అభ్యున్నతికి,అంబేద్కర్, పూలే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అవార్డు అందించిన స్వామి వివేకానంద అవార్డ్స్ వారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాము, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.