శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ఉండి కానుకలు లెక్కింపు
అక్షర విజేత ఎర్రుపాలెం
ఎర్రుపాలెం మండలం చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం లో భక్తులు సమర్పించిన ఉండి కానుకలను కార్యనిర్వహణాధికారి కే జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు. 91 రోజుల్లో 32,87, 440 రూపాయల కానుక రూపంలో ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ పరిశీలకులు ఆర్ సమత తెలియజేశారు.కార్యక్రమంలో దేవస్థానం వ్యవస్థాపకులు ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ఆలయ సూపర్ రింటేoడెంట్ కే విజయ్ కుమారి,ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాస్, ఉప ప్రధానార్చకులు విజయ్ దేవశర్మ, సిబ్బంది అదేవిధంగా శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు