కాంగ్రెస్ లోకి సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్, బిఆర్ఎస్ నాయకులు
అక్షర విజేతకారేపల్లి:
కారేపల్లి సహకార పరపతి సంఘం గిద్దవారిగూడెం గ్రామానికి చెందిన సోసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్ గురువారం వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరారు. బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన డేగల సొసైటీ చైర్మన్ దుగ్గీనేని శ్రీనివాస్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోత్ రామ్మూర్తి నాయక్ ఆధ్వర్యంలో వైరా క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో పార్టీలో చేరారు. గుంపెళ్లగూడెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ భూక్య సోమ్లా, వార్డు సభ్యులు అంగోత్ రథ్య లు నాయకులు బాణోత్ వీరన్న(చక్రం) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. వారు ఇరువురిని ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ బాణోత్ హిరలాల్ పాల్గొన్నారు.