సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కొబ్బరికాయల వేలం పాట
. సిరసనగండ్ల గుట్ట దేవస్థానం
. బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 16నుండి
అక్షర విజేత,చారకొండ:
నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరసనగండ్ల గ్రామం అయోధ్య నగర్ గుట్ట లో వెలసిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ మాసంలో జరుగుతున్న సందర్భంగా గురువారం దేవస్థానంలో కొబ్బరికాయలు,కొబ్బరి చిప్పలు,తలనీలాలు, ప్రసాదాల వేలం పాట ఆలయ కమిటీ చైర్మన్ డేరం రామశర్మ,ఈవో రఘు ఆధ్వర్యంలో నిర్వహించారు.కొబ్బరికాయల వేలం పాట 14లక్షల15వెలు,కొబ్బరి చిప్పలు 80 వేలు. యాద్రాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కాంచనపల్లి గ్రామానికి చెందిన సౌరాల అనిల్ కుమార్ దక్కించుకున్నారు.ప్రసాదాలు లడ్డు పులిహోర 1లక్ష50వేల కు హైదరాబాదుకు చెందిన చిరువెళ నవీన్ శర్మ దక్కించుకున్నారు.తల నీలాలు వాయిదా వేయడం జరిగింది.తదుపరి తేది త్వరలోనే ప్రకటిస్తామని ఆలయ చైర్మన్ తెలిపారు.వేలం పాటలో పాల్గొని టెండర్ దక్కించుకున్న వారు నిర్మిత సమయంలో రుసుము చెల్లించాలని లేని యెడల టెండర్ రద్దుచేసి టెండర్ వేయడం జరుగుతుంది కనుక శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నియమాన్ని బంధాలను పాటించి సహకరించాలని ఆలయ చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయం మేనేజర్ నిరంజన్, మురళీధర్ శర్మ,లక్ష్మణ్ శర్మ,సీతారామ శర్మ, కోదండరామ శర్మ,వేణు శర్మ,గోపిశర్మ,తదితరులు పాల్గొన్నారు.