కొండపాక జర్నలిస్ట్ సంఘం అధ్యక్షునిగా చిలుముల వెంకటేష్
అక్షర విజేత కొండపాక
కొండపాక మండల జర్నలిస్ట్ సంఘం నూతన
పాలకమండలి ఎన్నికలు మంగళవారం రోజు జరిగాయి. దుద్దెడ రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో సర్వ సభ్యులు సమావేశంలో రెండు సంవత్సరాల కాలపరిమిదికి నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా చిలుముల వెంకటేష్ నమస్తే తెలంగాణ ఉపాధ్యక్షుడిగా వడ్లకొండ శ్రీనివాస్ ఆంధ్ర ప్రభ ప్రధాన కార్యదర్శిగా దేవీ కిరణ్ వార్త కోశాధికారిగా కృష్ణారెడ్డి తెలుగు ప్రభ , సహాయ కార్యదర్శిగా సాగర్. ఎస్ఎస్సి సలహాదారుగా శ్రీహరి ఈనాడు లను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. సంఘం అభివృద్ధి కోసం పాటుపడతామన్నారు. కుకునూర్ పల్లి , కొండపాక మండలాల పరిధిలోని జర్నలిస్టుల సమస్యల సాధనకు తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కుసుంబ శ్రీనివాస్,నర్ర సాయి, నాగరాజు ,బాల్రెడ్డి ,సంపత్ ,బుచ్చిరెడ్డి ,భాస్కర్, యాదగిరి ,పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.