గెలిచిన వంద రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు సిసి రోడ్లు నిర్మాణ పనులు
– రాంచంద్రునాయక్ పాలనలో బూత్ స్థాయి కార్యకర్తకు ప్రాధాన్యం
– గెలిచిన నాటి నుంచే గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం
– మరిపెడ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరా రెడ్డి
అక్షర విజేత మరిపెడ:-
డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షపాతి అని, సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కాంగ్రెస్ పాటుపడుతోందని, ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ పాలనలో బూత్ స్థాయి కార్యకర్తకు కూడా పనులు ఇవ్వటం జరిగిందని కాంగ్రెస్ మరిపెడ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరా రెడ్డి అన్నారు. ప్రజల కోసం అహర్నిషలు పని చేస్తున్న ఎమ్మెల్యే పై తప్పుడు కథనాలు రాయటం సరికాదని, అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నారన్న అక్కసుతో ఇలా రాయిస్తున్నారని ఎమ్మెల్యేపై వచ్చిన కథనాన్ని ఆయన ఖండించారు. గురువారం ఆయన మరిపెడ మునిసిపల్ కేంద్రలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై తప్పడు కథనాన్ని ఖండించారు. కాంగ్రెస్ గెలిచిన నాటి నుంచే ప్రజా పాలనపై దృష్టి సారించిందని, గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు వేయిస్తూ అభివృద్ధికి పాటుపడుతోందన్నారు. అదే విధంగా పార్టీలోని అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. అక్రమార్కులకు అడ్డుకట్ట వేసి వారిని నిలువరిస్తున్న క్రమంలో ఆయనపై కొందరు కావాలని తప్పుడు వార్తలు రాయిస్తున్నారని మండి పడ్డారు. ప్రజా పాలనలో భాగంగా రాత్రింబవళ్లు ఆయన ప్రతి మండలం సందర్శిస్తూ అధికారులతో రివ్యూలు నిర్వహిస్తున్నారన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే ప్రజా ప్రతినిధిపై అవాస్తవాలు, సత్యదూరమైన ఆరోపణలు చేయటం హేయనీయమని, ఆయన పరువుకు భంగం, కాంగ్రెస్ పాలనపై అసత్య ఆరోపణలు చేస్తూ కథనం రాసిన వారిపై చట్ట రీత్యా, న్యాయ శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.