* బురాన్ పల్లి గ్రామ అభివృద్ధే లక్ష్యం
* 20 లక్షలు ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో సిసి రోడ్డు నిర్మాణం
* శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సహాయం మరువలేనిది
* వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి సహకారం
* కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్ గౌడ్
గ్రామాంతర్గత రహదారి వ్యవస్థ బాగుంటేనే గ్రామాభివృద్ధి చెందుతుందని బురాన్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకుడు మనోహర్ గౌడ్ అన్నారు. శుక్రవారం మనోహర్ గౌడ్ అక్షర విజేత వికారాబాద్ ప్రతినిధితో మాట్లాడారు. తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సహాయ సహకారంతో వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బురాన్ పల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంజిఎన్ఆర్ఈజిఎస్ 20 లక్షల నిధులతో గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. 20 లక్షల నిధులు మంజూరు చేయించడంలో తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక కృషి ఉందని మనోహర్ గౌడ్ గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శాసన సభాపతి అని కొనియాడారు. అణగారిన వర్గాలకు చేదోడువాదోడుగా నిలుస్తాడని ఆయన కొనియాడారు. గ్రామంలో సైడ్ డ్రైనేజీలతో పాటు అవసరమైన చోట అండర్ డ్రైనేజీ నిర్మాణం కూడా చేపట్టనున్నామని ఆయన ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో బురాన్ పల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసి తీరుతానని గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు.