బిఆర్ఎస్ లో చేరిన బీఎస్పీ నాయకులు.
అశ్వాపురం, మార్చి 26 :అక్షర విజేత
బిఎస్పి పార్టీ భద్రాది కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రెటరీ భాగవతపు సతీష్ యాదవ్, బివిఎఫ్ జిల్లా కన్వీనర్ ఇసంపల్లి శివకుమార్ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన వాదం తెలంగాణ వాదం కలిసి రాబోయే రోజుల్లో అనగారిన వర్గాల వారికి సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటున్నామని అన్నారు.