బి ఆర్ ఎస్ పార్టీ మారను ప్రజల్లో ఉంటా
వ్యాపార నిమిత్తం ఆఫ్రికా వెళ్లాను
మండల నాయకులతో మాజీ ఎమ్మెల్యే పైలెట్
30న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక
అక్షర విజేత, తాండూర్
తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గురువారం ఆయన నివాసంలో తాండూర్ నియోజకవర్గం లోని పార్టీ నేతలు నాయకులతో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ అభ్యర్థి కాపాన్ని జ్ఞానేశ్వర్ ను గెలిపిద్దాం మద్దతుగా పార్టీ నాయకులతో ప్రచారం నిర్వహిస్తానని అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని 30 తేదీన శనివారం పట్టణంలోని జిపిఆర్ గార్డెన్ లో సన్నహాక సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు
ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని తెలిపారు
అంతకుముందు మాట్లాడుతూ
మూడు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలు వినిపించాలన్న సమస్యలు కాపాన్ని జ్ఞానేశ్వర్ ను ఎంపీగా గెలిపించుకుందాం పార్టీ ముఖ్య నాయకులతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
బాబాయ్ అందుబాటులో ఉంటారు
నేను వ్యాపారం పరంగా తరచు ఆఫ్రికా వెళ్తున్నానని కావున నేను అందుబాటులో ఉండలేకపోయినా ఎక్కడ తాండూర్లో బాబాయ్ శ్రీశైల్ రెడ్డి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
అన్నారు ప్రస్తుతం మూడు నెలలలోఎంపీ ఎన్నికల తాండూరు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చెప్పారు
ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీశైల్ రెడ్డి, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మాజీ సర్పంచ్ రాజప్ప గౌడ్, రాంలింగారెడ్డి, వీరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, గౌడి వెంకటేశం, నరేందర్ రెడ్డి, పటేల్ ఉమాశంకర్, అంతారం రాములు, రాకేష్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, వసంత్ కుమార్, అశోక్ కుమార్, జైపాల్రెడ్డి, పెద్దేముల్ మండల అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్ యాదవ్, ఆయా మండలాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.