కాంగ్రెస్ గూటికి బి ఆర్ ఎస్ ఎంపిటిసి
ఆహ్వానించిన సంపత్ కుమార్
అక్షర విజేత అలంపూర్
నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు ఒక్కొక్క రిగా ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. మానవపాడు మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన ఎంపీటీసీ ఈదమ్మ తన 30 మంది అనుచరులతో కలిసి ఎ ఐ సి సి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో మానవపాడు మండలం అధ్యక్షులు జగన్ మోహన్ నాయుడు, అలంపూర్ మండలం అధ్యక్షులు అడ్డాకుల రాము, ఇస్మాయిల్, గద్వాల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్, లక్ష్మి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.