అవకాశవాదులతో బిఆర్ఎస్ కి నష్టం లేదు
మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్
అక్షర విజేత కారేపల్లి:
సింగరేణి మండలం లో బి అర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో వైరా నియోజకవర్గంపార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ సమావేశం నిర్వహించారు .కొంత మంది అవకాశవాదులు స్వార్థపరులు తమ సొంత ప్రయోజనాల కోసం పార్టీ ని వీడిన మాత్రాన పార్టీ కి ఎటువంటి నష్టం లేదని పడి లేచిన కెరటంలాగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా చాటుతుంది అని దిమ వ్యక్తం చేశారు .రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలను కోరారు. నేనెప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చిన ఆదుకుంటానని నా జీవితం ఎల్లప్పుడూ కూడా ప్రజలకు అంకితం అని ఏ రోజు కూడా పదవులు ఆశించి రాజకీయాలలో రాలేదని ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వచ్చానని తెలిపారు.నాకు ఎటువంటి వ్యాపారాలు గాని వేరే ఉద్యోగం లేదని ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మండలం జెడ్పీటీసీ వాంకొడోత్ జగన్ నాయక్, ఎంపిటిసి శంకర్,మాజీ జెడ్పీటీసీ ఉన్నం వీరేందర్, తాత వెంకన్న,జడల వెంకటేశ్వర్లు. డొంకన రవీందర్, Sk గౌసుద్దీన్, పాటి రాంబాబు,రవీందర్ రెడ్డి, సైందులు,దారవత్ వికాస్, బానోత్ రాజేష్,స్వామి,చందు,హతిరం, గణతి సత్యం,ముతల్ రావు,భూక్యా మధు,రవికుమార్,శంకర్, బాసింగ్, వెంకటేష్ తదితరుల పాల్గొన్నారు