ధన్వాడలో బిజెపి కార్యకర్తల సమావేశం….
అక్షర విజేత, మరికల్/ధన్వాడ
నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బిజెపి నాయకుల ,కార్యకర్తల సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య నాయకులు సదానంద రెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ విషయమే వారు మాట్లాడుతూ ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్, బిజెపి ధన్వాడ మండల అధ్యక్షులు మాకం సురేందర్, నాయకులు నర్సింహులు కురువ మల్లయ్య, బుడ్డన్న, రాఘవేంద్ర గౌడ్, శివరాజు, జుట్ల రాఘవేంద్ర గౌడ్, బీజేవైఎం నాయకులు శ్రీనివాసులు ,వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.