బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
అలంపూర్ నియోజకవర్గంలో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సంపత్ కుమార్
అక్షర విజేత అలంపూర్
ఎమ్మెల్సీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అలంపూర్ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే ఎఐసిసి కార్యదర్శి డా”ఎస్.ఎ. సంపత్ కుమార్ సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో కి మంగళవారం భారీగా చెరికలు జరిగాయి.
అలంపూర్ నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు,ఎంపిటిసిలు, ప్రస్తుతం ఐజ 10వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మేకల అనిత భర్త మేకల నాగిరెడ్డి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రంగు శ్రీధర్, ఉప్పల తిమ్మ రెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్, మాజీ సర్పంచ్ లక్ష్మన్న, ఏక్లాస్పుర్ మాజీ సర్పంచ్ ఆంజనేయులు, మాజీ సర్పంచ్ భీమన్న , కురువపల్లె కిస్టాపురము ఉప్పల క్యాంపు,ఎక్లాస్పురం,దేవ బండ మొదలగు గ్రామాల నుండి భారీ సంఖ్యలో దాదాపు 200 మంది బి ఆర్ ఎస్ ముఖ్య నాయకులు హైదరాబాదులోని సంపత్ కుమార్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. వీరందరికీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సాధారంగా ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నారు.