తులసి వనంలో నుంచి గంజాయి మొక్కలు పోయాయి..
బాన్స్వాడ నియోజకవర్గంలో స్వచ్ఛమైన భార స ఉంది..
అక్షర విజేత కామారెడ్డి బ్యూరో
బాన్స్వాడ నియోజకవర్గంలో తులసి వనంలో నుంచి గంజాయి మొక్కలు పోయాయంటూ, ఇటీవల భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ,కాంగ్రెస్ గూటిలోకి చేరిన సందర్భంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పై విధంగ వ్యాఖ్యానించారు. తాను 25 ఏళ్లుగా తన వెంబడి తిరుగుతున్న కొంతమంది ప్రజాప్రతినిధులను ,నాయకులను ,కార్యకర్తలు నా కుటుంబ సభ్యులను చూసుకున్నానని ,అవసరం వచ్చినప్పుడు తాను కాదు అంటూ ,కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు .బాన్స్వాడ నియోజకవర్గంలో తాను తులసి వనాన్ని నాటానని ,అనుకుంటే కొంతమంది తనను మోసం చేయడానికి తులసి వనంలో గంజాయి మొక్కలు చేరినట్లు చేరి, భారత రాష్ట్ర సమితి పార్టీ పరువును బయట పెట్టడానికి గోడదూకి వేరే పార్టీలోకి చేరారంటూ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు బాన్సువాడ 8 మండలాల్లో స్వచ్ఛమైన తులసి మొక్కలు ఉన్నాయని ,వాటితో రానున్న ఎన్నికల్లో తమ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు .కొన్ని గంజాయి మొక్కలు పోయినంత మాత్రాన, తమ పార్టీకి ఏమి డోకా లేదని పోచారం వెల్లడించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ఇంకా భారత రాష్ట్ర సమితి పార్టీ బలంగా ఉందని పోచారం ఈ సందర్భంగా వెల్లడించారు .తనను అడ్డంగా పెట్టుకుని కొంతమంది చెత్త అడ్డగోలుగా సంపాదించుకొని ,తన పేరుకు మచ్చ . తెచ్చారంటూ పోచారం ఆరోపించారు .పదేళ్ల కాలంలో గులాబీ నేత కెసిఆర్ వద్ద ఉన్న చొరవతో నియోజక వర్గాన్ని, తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు ,తన తనియుడు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి బాన్సువాడ నియోజకవర్గం బారసా పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు ,ఈ సందర్భంగా పోచారం వెల్లడించారు .బాన్సువాడ నియోజకవర్గంలోని భార స నాయకులు గని, కార్యకర్తలకు గాని ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ,ఎవరు అధైర్య పడవద్దని గులాబీ శ్రేణులకు పోచారం భరోసా కల్పించారు. మంగళవారం బాన్సువాడ శివారులో జరిగిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు, నాయకులు ,కార్యకర్తలు మహిళా నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.