ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహణ కార్యాక్రమం
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవర్ ఆదేశాలతో మంగళవారం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో “ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహణ కార్యాక్రమం” నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ ఎసిపి నారాయణ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, ప్రజల మన్ననలు పొందాలని, ఆటోలు లైసెన్స్ లేని వారికి ఆటోలు అద్దెకు ఇవ్వరాదని అన్నారు. ఎవ్వరూ కూడా మద్యం తాగి ఆటోలు నడుపరాదని, ఓవర్ లోడ్ ఎక్కించుకోరాదని, ఫోన్ మాట్లాడుతూ ఆటో నడుపరాదని ట్రాఫిక్ నిబంధనలు ప్రతీ ఒక్కరు పాటించాలని, ఎవరూ కూడా ఎక్కువ ట్రిప్పులు కొట్టాలని తొందరపడకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ప్రతీ ఒక్కరూ తమ ఆటోలను రోడ్డు ప్రక్కన మాత్రమే ఆటోలు పార్క్ చేసుకోవాలని, ఎక్కడపడితే అక్కడ నిలుపడం వలన ట్రిఫిక్ కు ఇబ్బందులు తలెత్తుతాయని, ఆటోలకు నెంబర్లు లేకుండా నడుపరాదని, రిజిస్ట్రేషన్ నెంబర్ కనపడేలా ఉండాలని పేర్కొన్నారు. ఆటోలకు నెంబర్ సిస్టమ్ ఉండడం వలన దొంగతనాలు, ప్రమాదాలు జరిగినప్పుడు తొందరగా గుర్తించే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వాహనాలను నడిపి గమ్యస్థలానికి చేరుకోవాలని, ఆటోలలో మహిళా ప్రయాణికులు ఎక్కినప్పుడు మర్యాద పూర్వకంగా మాట్లాడాలని తెలిపారు. ఈ కార్యాక్రమంలో నిజామాబాద్ ఎసిపి ఎల్.రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వి.వెంకట నారాయణ, టౌన్ సి.ఐ బి.నరహరి, టౌన్ 1 ఎస్.హెచ్.ఓ డి. విజయ్ బాబు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.