శివంపేట మండలంలో సెగల్ ఫౌండేషన్ మాటున అక్రమ మట్టి దందా
అక్షర విజేత నర్సాపూర్ ప్రతినిధి:
నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలంలోని లింగోజిగూడ గ్రామ పరిధిలో గల ఊర చెరువులో సెగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ చెరువు కట్ట ఎత్తు పెంచడం కోసం ఇరిగేషన్ పర్మిషన్ తీసుకొని చెరువుకట్టను మట్టి తో ఎత్తు పెంచడం జరిగింది. అయితే చెరువు కట్ట పేరుతో అక్రమ మట్టి దందా నడిపిస్తున్న సెగల ఫౌండేషన్ కొత్తపేట గ్రామంలోని సర్వేనెంబర్ 480 లోనీ ఖాళీ స్థలంలో దాదాపు పది ట్రాక్టర్లతో 100 ట్రిప్పులు మట్టిని అక్రమంగా చెరువులో నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా సెగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్రమ మట్టి రవాణా జరిగింది. దీని కోసమై శివంపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్ మట్టి ట్రాక్టర్లను ఆపి పర్మిషన్ లేకుండా ఎందుకు మట్టి నడిపిస్తున్నారని ప్రశ్నించారు. అయితే అక్రమ మట్టి నిర్వాహకులు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి భయపడేది ఏమీ లేదు అంటూ వారిని హెచ్చరించారు. అయితే ఈ విషయమై సెగల్ ఫౌండేషన్ ప్రతినిధిని మీకు ఎలాంటి పర్మిషన్లు ఉన్నవి అని అడగగా ఆయన సమాధానం తెలుపుతూ ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్, లాంటి పర్మిషన్లు అన్నీ ఉన్నవి అందుకనే మట్టి పూడిక తీస్తున్నామని ఆయన సమాధానం ఇచ్చారు. అయితే అక్కడే తిరకాసు సెగల్ ఫౌండేషన్ ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వద్ద మాత్రమే పర్మిషన్ ఉన్నట్లు వారి సూపర్వైజర్ తెలిపారు. ఇదే విషయమై మీడియా ప్రతినిధులు శివంపేట్ తహసీల్దార్ని ప్రశ్నించగా సెగల్ ఫౌండేషన్ వారు మా దగ్గరికి ఒకసారి రాగా అలాంటి పర్మిషన్లు ఏమి మేము ఇవ్వబోము. చెరువుల నుండి మట్టి పూడిక తీయొద్దని గతంలోనే వారికి మేము హెచ్చరించామని, శివంపేట్ తాసిల్దార్ తెలిపారు. అయితే తాసిల్దార్ ఫోన్ లో సెగల్ ఫౌండేషన్ వారిని మట్టి తీయొద్దని తెలుపంగ మళ్లీ చెరువులో పూడిక ఎందుకు తీస్తున్నారని ఆయన హెచ్చరించారు. అయినా సరే సెల్ ఫౌండేషన్ ప్రతినిధి నీళ్లు మింగుతూ సార్ తప్పైందండి రేపు భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని అని తీపిగా సమాధానం చెబుతూ దాటేశాడు. అయితే ఈ సెగల్ ఫౌండేషన్ మాటును జరిన అక్రమ మట్టి దందను ఎవరు అరికట్టాలి వీరి దగ్గర ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన పర్మిషన్ మాత్రమే ఉంది. మరి రెవెన్యూ, మైనింగ్ పర్మిషన్లు అవసరం లేదా అంటే కావాలనే సమాధానం కానీ నియోజకవర్గంలో అంబుజా సిమెంట్ పేరుతోనే, సెగల్ ఫౌండేషన్ పేరుతో, అక్రమ మట్టి దందలు జోరుగా కొనసాగుతున్నాయి అన్నది వాస్తవం. స్వచ్ఛంద సంస్థల పేరుతో హత్నూర, నర్సాపూర్, శివంపేట్ తదితర మండలాలలో చెరువులకు చెరువులే మింగేసి నల్ల మట్టి, మొరం మ్మటి లాంటి మట్టిని ,కొందరేమో ఇటుక బట్టీలకు, కొందరేమో అక్రమంగా మట్టి అమ్ముకోవడానికి, ప్రభుత్వ ,చెరువులను కుంటలను అక్రమ మట్టిదంటలకు అనువుగా చేసుకొని వారి వారి పనిని పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్వచ్ఛంద సంస్థల పేరుతో వచ్చే వారిని కట్టడి చేసి ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలని నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.