వాహనాల తనిఖీలలో 2,33,900/- సీజ్ చేసిన పోలీసులు
అక్షర విజేత సిద్దిపేట్
నంగునూరు మండలం ఎఫ్.ఎస్.టి. (ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం) ఎంపీడీవో హరిప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి, కానిస్టేబుళ్లు పరశురాములు, రాజు, విధి నిర్వహణలో భాగంగా ముండ్రాయి, వెంకటాపూర్ రోడ్ లో వాహనాలు తనిఖీ చేయుచుండగా రేసు బాలమల్లు, గ్రామం ఆకునూరు, మండలం చేర్యాల అతను తన యొక్క కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా 2,33,900/- తీసుకొని వెళ్ళుచుండగా పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. అట్టి డబ్బులను కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గ్రీవెన్స్ సెల్ లో డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు. సదరు వ్యక్తి కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గ్రీవెన్స్ అధికారులకు ఆధారాలు చూపించి డబ్బులు రిలీజ్ చేయించుకోవచ్చని అధికారులు తెలిపారు.