అక్షర విజేత మందమర్రి

ఊరు మందమర్రి లో మా ఊరు సేవా సంఘం ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి ఇబ్రహీం మరియు సంఘ అధ్యక్షులు పెద్ది రాజన్న ఆధ్వర్యంలో పిసిసి. మెంబర్ నూకల రమేష్ .35మంది నిరుపేదలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా .మాట్లాడుతూ ప్రతినెల మా ఊరు సేవా సంఘం తరపున పేదలను గుర్తించి సంఘం ఆధ్వర్యంలో సేవ చేయడం అభినందనీయమని ఇలాంటి సేవా కార్యక్రమాలకు తమ వంతుగా చేయూత నిస్తామని తెలపడం జరిగింది. ఫారెస్ట్ రిటైర్డ్ అధికారి కనుకుంట్ల మల్లయ్య . భాగస్వాములు గా.. నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందని ఎవరైనా సరే దాతలు వస్తు రూపంలో మా ఊరు సేవా సంఘం తరఫున పేదవారికి డొనేట్ చేయవచ్చని తెలుపడం జరిగింది.
కార్యక్రమంలో సేవసంఘ సభ్యులు ఎండి ముజాహిద్, పాలమాకుల భీమసేన్,పెద్ది భార్గవ్, మేసినేని అరుణ్, పల్లె మహేందర్, పృద్వి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.