కామ్రేడ్ దుగ్గి విశ్వనాధం71వ,జయంతి వేడుకలు
— భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం

–14 సంవత్సరాలు గ్రామాభివృద్ధికి కృషి
అక్షరవిజేత,చారకొండ:
చారకొండ మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ కామ్రేడ్ దుగ్గి విశ్వనాధం 71వ జయంతి వేడుకలను సీపీఐ నాయకులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు.మండల కేంద్రంలోని చెర్కుపల్లి చౌరస్తాలో దుగ్గి విశ్వనాధం స్థూపం వద్ద సీపీఐ జిల్లా నాయకుడు డాక్టర్ చిలివేరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ దుగ్గి విశ్వనాధం1981లో చారకొండ సర్పంచ్ గా వున్న సమయంలో గ్రామానికి చేసిన సేవలు మరువలేనివని,14 సంవత్సరాలు గ్రామ అభివృద్దికి ఎనలేని కృషి చేసి ప్రజల మన్ననలు పొందాడని అన్నారు.విశ్వనాధం కమ్యూనిస్టు ఉద్యమంలో చేరిన సమయంలో కల్వకుర్తి ప్రాంతంలో భూస్వాములకు వ్యతిరేకంగా ఆనేక ఉద్యమాలు చేసి పేద ప్రజల పక్షాన నిలిచాడని అన్నారు.కార్యక్రమంలో దుగ్గి అనిల్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జమ్మికింది బాల్ రాంగౌడ్,నాయకులు మద్ది నారాయణ రెడ్డి,మస్నపాండు,బ్రహ్మం,శంకరయ్య,లెనిన్,విష్ణు,మైబెలి,వేణుగోపాల్ రెడ్డి,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.