
–అసంపూర్తి రోడ్లతో జనం గోస
అక్షరవిజేత,చారకొండ:
గురువారం చారకొండ మండలం జూపల్లి గ్రామపంచాయతీ నుండి నెమలిగుట్ట తండకు వెళ్లే రహదారిని కాంట్రాక్టర్ కంకర వేసి అసంపూర్తిగా రోడ్డు వదిలేయడంతో 6 నెలలుగా తండవాసులు,బడికి వెళ్లే పిల్లలు నిత్యం కల్వకుర్తికి వెళ్లి పనులు రావడానికి ఇబ్బందులు పెడితే ప్రయాణం చేస్తున్నారు.ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదాలకు గురవుతు,గోస పడుతున్నారు,లారీలు వస్తే రోడ్డు కుంగి,వాహనాలు దిగబడుతున్నాయి. రోడ్డు మొత్తం గుంతల మయంగా మారింది.ఈ అసంపూర్తి రోడ్డు పని పూర్తిగా చేయాలని యువజన కాంగ్రెస్ నాయకుడు అశోక్ నాయక్ కోరారు.