ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
– ఎస్సై శ్రీనివాస్

ఓటు హక్కును వినియోగించుకోవడం సమాజంలోని ప్రతి ఓటరు బాధ్యత అని గద్వాల పట్టణ ఎస్సై శ్రీనివాస్ అన్నారు.ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, శాంతిభద్రత పరిరక్షణకు జిల్లా కేంద్రము లో అంబేడ్కర్ చౌక్, కృష్ణవేణి చౌక్, న్యూ బస్ స్టాండ్, నల్ల కుంట, పాత బస్ స్టాండ్, గాంధీ చౌక్, రాజ విధి, మోమిన్ మళ్ళ , రాఘవేంద్ర కాలనీ ల లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీఐఎస్ఎఫ్ జవాన్లతో సోమవారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనంతరం ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటర్లు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని చెప్పారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు సహకరించాలన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో రాజకీయ పార్టీల నాయకులు ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయవద్దని సూచించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు జిల్లా పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ బలగాలు కలిసి విధులు నిర్వర్తిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో గద్వాల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.