Logo
Date of Publish : 30 September 2026, 1:04 pm
Editor : B. Anil Kumar

వరంగల్ పై బీజేపీ ఫోకస్

- ఇప్పటికే గ్రేటర్ లో పట్టు..

- తదుపరి టార్గెట్ ఓరుగల్లు, నల్లొండ

- ప్రధాన నియోజకవర్గాలపై కన్ను

- చాపకింద నీరులా అన్ని ప్రాంతాలకు విస్తరణ

- కమళదళం వ్యూహం అదే..

విజేత, ఎడిటర్ డా.బి,అనిల్ కుమార్ : బెంగాల్ ఫలితాల తరువాత బీజేపీ కీలక ప్రకటన చేసింది. తమ తదుపరి టార్గెట్ తెలంగాణ అని ప్రకటించింది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చారు. హైదరాబాద్ లో వేల కోట్ల నిధులతో సరికొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో బలంగా ఉన్న బీజేపీ తెలంగాణలో కీలకమైన జిల్లాలపై ఫోకస్ చేసింది. వరంగల్, నల్గొండలను టార్గెట్ గా పెట్టుకుంది. గతంలో కొన్ని చోట్ల గెలిచినా ఆ ప్రభావాన్ని నిలకడగా కొనసాగించలేకపోయింది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెలవడం చాలా ముఖ్యం. అందుకే పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వరంగల్‌ను కీలక కేంద్రంగా ఎంచుకుని కొత్త కార్యాచరణను రూపొందించింది. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించడం బలహీనంగా ఉన్న చోట నాయకులను సిద్ధం చేయడం మొదలుపెట్టింది. కార్యకర్తలను చురుకుగా పనిచేయించేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది.

రంగంలోకి కొత్త టీం..

తెలంగాణ బీజేపీకి సంబంధించి కొత్త టీం రంగంలోకి దిగింది. సునీల్ బన్సల్ ఆధ్వర్యంలో అభయ్ పాటిల్, రేఖా శర్మ రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. సంస్థాగత వ్యవస్థను పటిష్టం చేసేందుకు నూకల మధుకర్‌ను హైదరాబాద్ కేంద్రంగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలు అందిస్తారు. మరోవైపు దశరథ్‌ను తెలంగాణ సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు. ఈయన వరంగల్ కేంద్రంగా పనిచేసేలా ఏర్పాట్లు జరిగాయి. గతంలో ఉన్న చంద్రశేఖర్ తివారీకి తెలుగు భాషపై పట్టు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. స్థానిక నేతలతో సమన్వయం దెబ్బతినడంతో అంతర్గత అసంతృప్తి బాగా పెరిగిపోయింది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకే తెలుగు తెలిసిన నాయకులకు పెద్దపీట వేశారు. మధుకర్ దశరథ్ నియామకం ద్వారా ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని అంచనా వేస్తున్నారు.

అలా చేస్తేనే సాధ్యం..

వరంగల్ కేంద్రంగా బీజేపీ రాజకీయాల ఉండబోతున్నాయి. ఉమ్మడి వరంగల్,ఖమ్మం,నల్లగొండ జిల్లాల నేతలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలి. అక్కడి పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ఎన్నికల నాటికి తిరుగులేని పట్టు సాధించాలి. అయితే కేవలం కొత్త నాయకులకు బాధ్యతలు ఇస్తేనే విభేదాలు పూర్తిగా సమసిపోవు. జిల్లాల నాయకత్వాన్ని అందరినీ కలుపుకొని పోవాలి. నిరంతరం క్షేత్రస్థాయిలో శ్రమించగలిగితేనే అసలైన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. లేకపోతే పాత సమస్యలే మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది. దీన్ని గ్రహించే అధిష్టానం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. నాయకుల మధ్య సమన్వయం కుదిరితేనే విజయాలు సాధ్యమవుతాయి. కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు పెద్దఎత్తున సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఎదురుకాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ కొత్త టీమ్‌కు అసలైన తొలి పరీక్ష. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ..వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల స్థానాలు కీలకం. ఓటర్ల నమోదు ప్రక్రియ అభ్యర్థుల సరైన ఎంపిక ప్రచారంలో సమన్వయం చాలా ముఖ్యం.

వ్యూహాత్మక ఎత్తుగడలు..

వ్యూహత్మక ఎత్తుగడలు వేయడంలో ఢిల్లీ కాషాయ నాయకత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలను ఇతర పార్టీలకు ఇస్తున్నారు. ప్రతిరోజు రాష్ట్ర అధ్యక్షుడు మొదలుకుని, గ్రామీణ స్థాయి కార్యకర్త వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేసేలా కార్యచరణ రూపొందిస్తున్నారు కాషాయ నేతలు. గతంలో బీజేపీ గెలిచిన నియోజకవర్గాలపై సైతం కాషాయ దళం ఫోకస్ పెంచింది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు పరకాల, వరంగల్ పశ్చిమ, వర్థన్నపేట నియోజకవర్గాలలో కార్యకర్తలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మిగతా నియోజకవర్గలైనా భూపాలపల్లి, జనగామ, వరంగల్ తూర్పు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, ములుగు నియోజకవర్గాలలో సైతం బీజేపీ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )