Logo
Date of Publish : 21 September 2026, 9:58 pm
Editor : B. Anil Kumar

మిథ్యగానే ఉచిత విద్య

- తెలంగాణాలో అమలుకాని విద్యాహక్కు చట్టం

- పేదలకు దక్కని 25 శాతం ఉచిత అడ్మిషన్లు

- పట్టించుకోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు

- పట్టించుకోని ప్రభుత్వం

విజేత, తెలంగాణ ఎడిటర్: రాష్ట్రంలో విద్యాహక్కు చ ట్టం అమలుకాకపోవడంతో ప్రత్యేక విభాగాలకు చెందిన విద్యార్థు లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టిక ల్‌ 21ఏ ప్రకారం దేశంలోని 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ తప్పనిసరిగా ఉచిత, నిర్బంధ విద్య అమలు చే యాల్సి ఉంది. ఇందులో భాగంగా పిల్లలకు ఎలిమెంటరీ ఎడ్యుకే షన్‌ (1 నుంచి 8 తరగతులు)ను ఉచితంగా అభ్యసించే హక్కు ను కల్పించింది. ఏదేని కారణం చేత ఎలిమెంటరీ విద్యను అభ్య సించని యెడల ఎలాంటి ప్రాథమిక విద్య చదవాల్సిన అవసరం లేకుండానే విద్యార్థి నేరుగా తన వయస్సుకు సరిపడా తరగతిలో చేరే అవకాశాన్ని కూడా ఆర్టికల్‌ 21ఏ కల్పించింది.ఎలిమెంటరీ స్థాయిలో పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్య అమలు చేసేందుకు గాను 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం ప్రత్యేకంగా విద్యాహక్కు చట్టం -2009ని రూపొందించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తమ విద్యా ర్థులకు తప్పనిసరిగా విద్యాహక్కు చట్టం అమలు చేయాల్సి ఉం ది. అయితే తెలంగాణలో ఈ చట్టం అమలుకు నోచుకోకపోవడం తోపాటు ఆదిలోనే చట్టం నిర్వీర్యం అయింది. ప్రభుత్వాల వైఖరి కారణంగా ప్రత్యేక అర్హతలుగల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. గత బీఆర్‌ఎస్‌ సహా ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వమూ చట్టాన్ని విస్మరించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏ పాఠశాలలోనూ అది అమలు కావడం లేదు.

*అమలుకాని రిజర్వేషన్లు..*

విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం పిల్లలను చేర్చుకోవడంలో ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌, ప్రత్యేక పాఠ శాలలు 25 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాల్సి ఉంది. చట్టం ప్రకారం అనాఽథలు, అంగవైకల్యంగల పిల్లలు, హెచ్‌ఐవీ సోకిన పిల్లలకు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యలో 5 శాతం ఉచిత వి ద్యను అందించాల్సి ఉండగా, షెడ్యూల్డ్‌ కులాల(ఎస్సీ)కు 10 శా తం, షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ)లకు 4 శాతం, బలహీన వర్గాలు (బీసీ), మైనారిటీలకు- 6 శాతం ఉచితంగా విద్యను బోధించాల్సి ఉంది.రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు సుమారు 41,337 ఉన్నవి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 70%, ప్రైవేటు పాఠశాలలు 30% నడుస్తున్నవి. వీటిలో విద్యార్థుల అడ్మిషన్లను ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేటు పాఠశాలలో 52% అధికంగా ఉంది. ప్రైవేటు విద్యాసంస్థలలో ప్రభుత్వం ఆర్థికంగా వెనుక బడిన వర్గాలకు కల్పిస్తున్న 25% రిజర్వేషన్లు అమలు కావడం లేదని అనేక ఆరోపణలు ఉన్నవి. రిజర్వేషన్ల అమలు పర్యవేక్షణకు సరైన అధికార యంత్రాంగం లేకపోవడం విచారకరం. నిరు పేద ప్రజలకు కూడా పై రిజర్వేషన్లపై సరైన అవగాహన లేదు. ఒకవైపు దినదినం ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గి, ప్రైవేటు విద్యా సంస్థల సంఖ్య పెరుగుతుంది. గుర్తింపులేని ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు లెక్కలేనన్ని నడుపుతున్నారు. ఈ పాఠశాలల్లో విద్యార్థుల రక్షణ కోసం అనేక సూచనలు, పాఠశాలల నిర్మాణంపై కూడా అనేక నిబంధనలను సూచిస్తూ సుప్రీం కోర్టు 2009లోను, 2017లోను కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కఠిన ఉత్తర్వులు జారీ చేసింది.

 *ప్రైవేటు విద్యాసంస్థల వెనుకంజ..* 

విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రత్యేక అర్హతలు గల విద్యార్థు లకు ఉచిత విద్యను అందించేందుకు ప్రైవేటు యాజమాన్యాల కింద పనిచేసే విద్యాసంస్థలు వెనుకంజ వేస్తున్నాయి. బడ్జెట్‌ పాఠ శాలలను మినహాయిస్తే దనార్జనే ధ్యేయంగా పని చేస్తున్న కార్పొరేట్‌, ఇతర ప్రైవేటు విద్యా సంస్థలు చట్టాన్ని తుంగలో తొక్క డమేగాకుండా, ప్రశ్నించిన వారికి అడ్మిషన్లు కూడా ఇవ్వకుండా వే ధిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యా సంస్థల నిర్వాహకులు వేలకు వేలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నా రు. విద్యార్థుల పక్షాన పోరాడాల్సిన విద్యార్థి సంఘాల నాయకులు కూడా విద్యాహక్కు చట్టంపై యాజమాన్యాలను ప్రశ్నించకపోవ డం గమనార్హం. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఈ విషయమై ధృష్టి సారించకపోవడంతో చట్టం నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా అమలుచేయాల్సిన అవసరం ఉంది.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )